బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్‌కు స్థలపరిశీలన
ప్రజాశక్తి -ఎస్‌ఆర్ పురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్‌ను నిర్మించుటకు శుక్రవారం మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట, ఎస్‌ఆర్‌పురంలో స్థలంను చిత్తూరు డిఆర్‌డిఏ పీడీ తులసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌ఆర్‌పురం మండలంలో 49 కొత్తపల్లిమిట్ట, ఎస్‌ఆర్ పురంనకు రెండు బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్ బిల్డింగులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నవరత్నాలలో భాగంగా హౌసింగ్ మంజూరైనా లబ్ధిదారులకు వడ్డీలేని రుణం కింద రూ.35వేలు అందించాలని, స్త్రీనిధి, జగనన్న తోడు తీసుకున్న లబ్ధిదారులు రెన్యువల్ చేయవలసిందిగా ఏపీఎం తిరుమల రాజును, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కొత్తపల్లి గ్రామ సచివాలయని ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించి, అమ్మ ఒడికి ఎన్ని గ్రీవెన్స్ వచ్చాయి, పంట బీమా కొత్త ఫెక్షన్లు ఎన్ని వచ్చాయని సిబ్బందిని ఆరా తీశారు. పీడీ వెంట డైరీ ఏపీఓ సురేష్ రెడ్డి, సీసీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










