Jun 29,2023 11:07

ప్రజాశక్తి-ముదిగుబ్బ : మండల కేంద్రంలోనీ కదిరి రోడ్ లో గల  ఈద్గా మైదానంలో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్న ముస్లింలు జామియా మస్జిద్ హజరత్ సాజిద్ బక్రీద్ పండుగ సూచనలు అల్లా యొక్క గొప్ప సందేశాలు కుర్బానీ సూచనలు తెలిపి బక్రీద్ నమాజ్ చదివించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాకు వేడుకోని దువా చేశారు. ఈద్గా మైదానంలో మండల కేంద్రంలోని ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొని బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముదిగుబ్బ సబ్ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ తన పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా జరిగిన బక్రీద్ పండుగ ముస్లింలు ఒకరిని ఒకరు ఆలింగణం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.