Jun 29,2023 12:05

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోనీ  స్థానిక  ఈద్గా మైదానంలో గురువారం బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు.  ఖాజీ ఫయాజ్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ నమాజును చదివారు. ఈ సందర్భంగా  కుర్బానీ గొప్పతనం గురించి ముస్లిం సోదరులకు తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాకు వేడుకోని దువా చేశారు. ఈద్గా మైదానంలో మండల కేంద్రంలోని ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొని బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.  అనంతరం ముస్లింలు ఒకరిని ఒకరు ఆలింగణం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.