Jun 29,2023 10:01

ప్రజాశక్తి-ఆత్మకూరు : మండల కేంద్రంలోనీ గ్రామ సచివాలయం-2 పక్కన ఉన్న ఈద్గా మైదానంలో బక్రీద్ పండుగను ఘనంగా ముస్లింలు జరుపుకున్నారు.  జామియా మస్జిద్ హజరత్ షబ్బీర్ బక్రీద్ పండుగ సూచనలు అల్లా యొక్క గొప్ప సందేశాలు కుర్బానీ సూచనలు తెలిపి బక్రీద్ నమాజ్ చదివించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాకు వేడుకోని దువా చేశారు. ఈద్గా మైదానంలో  మండల కేంద్రంలోని ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొని బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ముస్లింలు ఒకరిని ఒకరు ఆలింగణం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.