May 08,2023 20:54

టిడిపి బిసి నాయకులు వీరవల్లి శ్రీనివాస్‌
ప్రజాశక్తి - కాళ్ల
జగన్‌ దుర్మార్గ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించాలంటే బిసిలంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని టిడిపి బిసి నాయకులు వీరవల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం ప్రజాశక్తితో మాట్లాడారు. రాష్ట్ర బిసి సెల్‌ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జిల్లా బిసి నాయకులు రవీంద్రను కలిసి సత్కరించామన్నారు. బిసిలకు రాజకీయ హక్కులు కల్పించింది టిడిపి అన్నారు. టిడిపికి వెన్నెముక అయిన బిసిలు పార్టీ విజయం కోసం శ్రమించాలన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను బిసిలు భుజాన వేసుకోవాలన్నారు. టిడిపి విజయం కోసం ప్రతి కార్యకర్తా శ్రమించాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు బిసిల మధ్య దూరం పెంచాలని చూస్తున్నాయన్నారు. ప్రతి టిడిపి కార్యకర్తా రాబోయే రోజుల్లో పార్టీని విజయం వైపు నడిపించాలన్నారు. త్వరలోనే జిల్లాకు చెందిన బిసిలతో సభ ఏర్పాటు చేస్తామన్నారు.