ప్రజాశక్తి-కుందుర్పి బిసిల ద్రోహి టిడిపి అధినేత చంద్రబాబు అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ పేర్కొ న్నారు. కుందుర్పిలో శుక్రవారం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు అడుగ డుగునా ఇబ్బందులు కలిగించినందుకే చంద్రబాబుకు బిసి సామాజివర్గ ద్రోహిగా ముద్ర పడిందన్నారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ప్రజలను మోసం చేసి రైతులకు చిల్లి గవ్వ ఇవ్వకుండా కాలువ తవ్వి రైతు ద్రోహిగా నిచిచాడన్నారు. కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించి ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలను సభా సమావేశాలకు కూడా రానివ్వకుండా ఇబ్బంది కలిగించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిడిపికి చెందిన సజ్జల రుద్రమ్మ, కోళ్ల తిప్పమ్మ కుమారు డు మంజునాథ కుటుంబాలు వైసిపిలోకి చేరాయి. కార్యక్రమంలో ఎంపిపి కమల నాగరాజు, జడ్పిటిసి రాధా స్వామి, కన్వీనర్ సత్యనారాయణశాస్త్రి, జెఎసి మండల కన్వీనర్ ఈ.రాము, సింగిల్‌విండో ఛైర్మన్ ఎఆర్ వన్నూరు రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉషశ్రీచరణ్










