Apr 22,2023 21:05

అభినందనలు తెలుపుతున్న సిబ్బంది

ప్రజాశక్తి -అనంతపురం      అనంతపురం జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఈడిగా కుష్బూ కొఠారి శనివారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఈడీగా పనిచేస్తున్న నాగముణి పదవీ విరమణ చేయటంతో నూతనంగా బీసీ వెల్ఫేర్‌ ఎంపవర్‌ ఆపీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలో కారాలయంలో బాధ్యతలను స్వీకరించిన ఆమెకు కార్యాలయ సిబ్బంది సూపరింటెండెంట్‌ ఆర్‌.విజయలక్ష్మి, జూనియర్‌ అసిస్టెంట్‌ గోవిందరాజులు, టైపిస్టు వెంకటేష్‌, రికార్డు అసిస్టెంట్‌ రమేష్‌బాబు అభినందనలు తెలిపారు.