Oct 16,2023 20:11

మాట్లాడుతున్న ఆనం వెంకటరమణారెడ్డి

మాట్లాడుతున్న ఆనం వెంకటరమణారెడ్డి

బినామీ కంపెనీలతో భారీ కుంభకోణం
-ఇండోసోల్‌ కంపెనీ ఇడుపులపాయలో పుట్టింది
-టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:షిర్డీ సాయి, అరబిందో, ఇండోసోల్‌ కంపెనీలన్నీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బినామీవేనని ఈ కంపెనీలలో భారీ కుంభకోణం జరిగిందని టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. నెల్లూరు టిడిపి కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లక్ష షేర్‌ క్యాపిటల్‌ పెట్టుబడి పెట్టిన కంపెనీకి ఓ సంవత్సరం ఏడు నెలల్లో 76 వేల కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టారని వేలకోట్ల ప్రాజెక్టులు సొంతం చేసుకున్న ఇండో సోల్‌ కంపెనీ ఇడుపులపాయలో పుట్టిందన్నారు. పెట్టుబడులు పెట్టిన ఐదు నెలల్లో ఇండోసోల్‌ నుంచి నలభై తొమ్మిది శాతం షేర్లు అరబిందో గ్రూపు కొనేసిందన్నారు. మిగిలిన వాటిల్లో షేర్లు కొనుగోలు కోసం మరో జపనీస్‌ కంపెనీ వచ్చిందని, ఇది భారీ కుంభకోణం అన్నారు. అదాని డిస్టలిరీస్‌ కూడా బినామేనన్నారు.
జగన్‌ బినామీ కంపెనీలు ఢిల్లీ లిక్కర్‌ కేసులో భాగస్తులు అయినప్పుడు జగన్‌ ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో భాగస్వామి కాదా అని ప్రశ్నించారు. దొంగ కంపెనీలకు చంద్రబాబు పెట్టుబడుల అవకాశం ఇవ్వకపోవడమే ఆయన చేసిన తప్ప నన్నారు. రాష్ట్రాన్ని అభివద్ధి చేసిన చంద్రబాబు జైల్లో ఉన్నారని, రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ లో ఉన్నారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే షిర్డీ సాయి, అరబిందో, ఇండోసోల్‌ బూటకపు కంపెనీలపై విచారణ జరుపుతామన్నారు.