Mar 15,2022 17:19

ప్రజాశక్తి-పుత్తూరు టౌన్ : ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బిజెపిని వ్యతిరేకించండి‌ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం  నగిరి నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం పుత్తూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆర్ వెంకటేశ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి  వందవాసి నాగరాజు  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజల పైన ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి ప్రజలపైన భారాలు మోపుతున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికే విశాఖలోని స్టీల్ ప్లాంట్ ను అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు కారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన హామీ చట్టాలు అమలు చేస్తామని, రాయలసీమను అభివృద్ధి చేస్తామని చెప్పి అమలు చేయక రాష్ట్రానికి ద్రోహం చేశారని ఆరోపించారు. అదేవిధంగా  సిపిఎం పార్టీ అఖిల భారత 23వ మహాసభ  ఏప్రిల్ లో ఆరో తేదీ నుంచి జరగబోవు ముసాయిదా తీర్మానాన్ని పార్టీ శాఖలు చర్చించి సవరణలు సూచనలు చేయాలని మహాసభలు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు చిరంజీవి అమ్మ, పెరుమాల్ ,భాస్కర్ సామిల్ బాబు, తంగ రాజ్, ఏ. విజయ్, శివ, యాసీన్ భాష, మొహమ్మద్ భాషా, నరసింహులు, లక్ష్మయ్య ,వై నందయ్య తదితరులు పాల్గొన్నారు.