Apr 14,2023 21:18

నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న మున్సిపల్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు

     ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌   కార్పొరేషన్‌లో చట్టాన్ని అమలు చేస్తున్న అధికారులపై బిజెపి నాయకులు అసభ్య పదజాలంతో దూషించడం తగదని ఎపి ఎన్‌టిఒ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.చంద్రశేఖర్‌రెడ్డి, డి.చంద్రమోహన్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్రకుమార్‌ అన్నారు. కార్పొరేషన్‌ అధికారులపైన బిజెపి నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం మున్సిపల్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, ఐక్యకార్యాచరణ కమిటీల ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలను నగర పాలక సంస్థ ఉద్యోగులు అమలు చేస్తుంటే బిజెపి నాయకులు మాత్రం బెదిరింపులకు దిగడం ఏంటని ప్రశ్నించారు. అదికూడా బట్టలూడదీసి కొడతామని బెదిరింపులకు గురి చేయడం బాధాకరమన్నారు. ఉద్యోగుల విధులకు ఆటకం కిలిగించే విధంగా ప్రవర్తించిన బిజెపి నాయకులపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎపి ఎన్‌జీఓ ఉపాధ్యక్షులు రవికుమార్‌, జమీలాబేగం, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, కోశాధికారి బషీర్‌అహ్మద్‌, జాయింట్‌ సెక్రటరీలు అజరు, లింగమేష్‌, సిటీ అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సిటీ కార్యవర్గ ఆర్‌.శ్రీనివాసులు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఎటిఎం నాగరాజు, నగర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.