Mar 28,2022 16:35

ప్రజాశక్తి-పిచ్చాటూరు : దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వంను వ్యతిరేకించాలని, ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్  పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో మండల కేంద్రమైన పిచ్చాటూరు లో సి ఐ టి యు, రైతు సంఘాల ఆధ్వర్యంలో  సాయిబాబా గుడి నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ ఆంధ్ర త్వరలో చేస్తున్న సమ్మెకు మద్దతు ఇస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కంపెనీలకు ఊడిగం చేస్తూ, రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా వేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు కర్మాగారం ను" ఆదాని"కి అప్పజెప్పే ఉద్దేశ్యంతో విక్రయానికి పెట్టారని విమర్శించారు.దేశంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు సృష్టించ కపోగా ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేటు రంగానికి కట్టబెట్టడానికి“మానిటైజేషన్"(నగదీకరణ) అనే పేరుతో  విమానాలను, రైల్వేలను, ఓడరేవులను, బొగ్గు గనులను, విద్యుత్ సంస్థలను, నేషనల్ హైవే లను, ఎయిర్పోర్టు లను, టెలికాం ఎల్ఐసి,  -బ్యాంకు లు వంటి ప్రభుత్వ రంగ సంస్థలను  కార్పొరేటు కంపెనీల కొరకు కారుచౌకగా వేస్తున్నారని విమర్శించారు.దేశం దారుణాలుఇంత జరుగుతున్నా రాజకీయ పార్టీలు కిమ్మనకుండా ఉన్నాయని విమర్శించారు.
రైతే  రాజు అని చెప్పుకునే ప్రభుత్వాలు ఆ రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్కు మంగళం పాడే పద్ధతులలో విద్యుత్తును ప్రైవేటీకరించండం వల్ల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించి ముందస్తు రీఛార్జ్ చేస్తే తప్ప పని చేయని విధానాన్ని తీసుకువస్తున్నారని తప్పుపట్టారు బ్రిటిష్ ప్రభుత్వ హయాం నుంచి కాపాడుకున్న  కార్మికుల హక్కులను నేడు  మోడీ ప్రభుత్వం కంపెనీల యజమానులకు,ఆనుకూలంగా వాటిని రద్దు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేంద్రంలోని బిజెపి  ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు, ఈ క్రమంలో  అంగన్వాడి నాయకులు ఇంద్రాణి, సఫియా, కళ్యాణి, శ్రీ వాణి, శ్రీ దేవి, పంచాయతీ కార్మికులు జానకిరామన్,కెవిపియస్ మండల కార్యదర్శి పి జి తంగారాజ్,ఓబులు, ఖాదర్బాష, గ్రీన్ అంబాసిడర్ లు పెద్ద ఎత్తున తరలివచ్చారు.