Aug 17,2023 22:06

బీఎల్వోలు బాధ్యతగా విధులు నిర్వహించాలి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
బీఎల్వోలు బాధ్యతగా విధులు నిర్వహించాలని, ఎన్నికల విధులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ స్పష్టం చేశారు. ఓటర్ల రీ వెరిఫికేషన్‌ కార్యక్రమంపై నగరపాలక కార్యాలయంలో బీఎల్వోలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితా రీ వెరిఫికేషన్‌ కార్యక్రమం క్షేత్రస్థాయిలో పక్కాగా చేపట్టాలన్నారు. బీఎల్వోలు నేరుగా ప్రతిఇంటికీ వెళ్లి ఓటర్ల జాబితా రీ-వెరిఫికేషన్‌ చేపట్టాలన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితా తయారీకి బాధ్యతగా పనిచేయాలన్నారు. బిఎల్వోలు విధినిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్‌ వెరిఫికేషన్‌ జాబితా పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ప్రభాకర్‌, సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, ఏఎస్వో సౌందర్‌ రాజన్‌, ఎసీపీ రామకృష్ణుడు పాల్గొన్నారు.