Jun 11,2023 20:23

ప్రజాశక్తి - మొగల్తూరు
మండలంలోని పేరుపాలెం బీచ్‌ వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. బీచ్‌కు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు అధిక సంఖ్యలో ప్రత్యేక, ద్విచక్ర వాహనాల్లో ఉదయమే తరలివచ్చారు. పలువురు సముద్ర కెరటాల్లో స్నానాలు చేశారు. చిన్నారులు ఒడ్డుకు కొట్టుకొస్తున్న కెరటాలతో, ఇసుక తేన్నెలపై ఆటలాడుకున్నారు. ఒడ్డున ఉన్న ఆలయాలను దర్శించుకుని సర్వే, కొబ్బరి తోటల్లో సహపంక్తి భోజనాలు చేసి సేద తీరారు.