చిత్తూరుఅర్బన్: జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా బిఎంసియుల నిర్మాణానికి స్థలాల కేటాయింపు ప్రక్రియ ను వేగవంతం చేయాలని ఎపిడిడిసిఎఫ్‌ఎల్ ఎండి అహ్మద్ బాబు పేర్కొన్నారు. గురువారం వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా మల్టీ పర్పస్ ఫెసిలిటేషన్ భవన నిర్మాణాలు, బిఎంసియు, ఎఎంసియు నిర్మాణాల పురోగతిపై జిల్లా కలెక్టర్లు, జిల్లా జాయింట్ కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, అందులో భాగంగా జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా బిఎంసియు, ఎఎంసియు భవన నిర్మాణాలకు గుర్తించిన భూములను ఇంజనీర్లకు అప్పగించడం తో పాటు ఇంకా స్థలాలు కేటాయించని మండలాలలో స్థలాన్ని కేటాయిం చేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా లో జగనన్న పాల వెల్లు వ కార్యక్రమంలో భాగంగా 271 బి ఎం సి యులు మంజూరు కాగా ఇందు లో 251 బిఎంసియులకు స్థలాలను గుర్తించడం జరిగిందని, మల్టీ పర్పస్ ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాటులో భాగంగా మొదటి విడత లోమంజూరు అయిన వాటి నిర్మాణ పనులు జరుగుతున్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ కమీషనర్ కు వివరించారు.. ఈ వీడియో కాన్ఫ రెన్స్ కు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకట్రావు, మార్కెటింగ్ శాఖ ఎడి ఇందుమతి, డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ ఆఫీ సర్ బ్రహ్మానంద రెడ్డి పాల్గొ న్నారు.










