Aug 15,2023 22:00

బహుమతులు అందుకున్న వ్యవసాయ, డ్వామా, పంచాయతీశాఖల శకటాలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ : ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమాభివద్ధి పథకాలకు అద్దంపట్టేలా శకటాల ప్రదర్శన జరిగింది. మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు శాఖల ద్వారా అందిస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను తెలుపుతూ శకటాల ప్రదర్శన సాగింది. ఈ శకటాల ప్రదర్శనలో భాగంగా తొలుత పోలీస్‌శాఖ వారిచే శకట ప్రదర్శన దిశ పోలీసింగ్‌ వ్యవస్థ, ఫాల్కాన్‌ వాహన ప్రదర్శన మిస్ట్‌ బుల్లెట్‌, మిస్ట్‌ జీపు, ఐఎఫ్‌బి బోట్‌, రెస్క్యూ టెండర్‌ వాహనాలను ప్రదర్శిస్తూ అగ్నిమాపక శకటాలు చిరుధాన్యాల పంట, డాక్టర్‌ వై.యస్‌.ఆర్‌ రైతు భరోసా, ఉచిత పంటల భీమా పథకాలపై అవగాహన కల్పిస్తూ సాగిన వ్యవసాయశాఖ శకటం, ఉపాధి హామీ, జల్‌శక్తి అభియాన్‌ వంటి సమగ్ర గ్రామీణాభివద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రామాలను తెలియపరుస్తూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటం వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం ద్వారా చేపడుతున్న పింఛన్ల పంపిణీ, చేయూత మహిళా మార్ట్‌, వైఎస్‌ఆర్‌ చేయూత, ఆసరా పథకాలను తెలుపుతూ సాగిన డిఆర్‌డిఏ శకటం, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం గురించి తెలుపుతూ గహనిర్మాణ సంస్థ శకటం, సివిల్‌ సప్లైస్‌ కార్యక్రమాల ద్వారా చేపడుతున్న శకటం, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం 104, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ 102, 108 వాహన సేవలతో వైద్యఆరోగ్య శాఖ, జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాలను తెలుపుతూ విద్యాశాఖ, జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమ లక్ష్యం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ అని తెలుపుతూ జిల్లా పంచాయతీశాఖ, పురపాలిక సంస్థ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాల శకటాలను ప్రదర్శించారు. బహుమతులను జిల్లా ఇంచార్జ్‌ మంత్రి ఉష శ్రీచరణ్‌, జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌, అతిథుల చేతుల మీదుగా అందజేశారు.