వివరానలను వెల్లడిస్తున్న మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి
ప్రజాశక్తి-పుత్తూరు టౌన్:
పురపాలక సంఘం పరిధిలోని కూరగాయల మార్కెట్, జంతు వదశాలలకు 2022-23 ఆర్ధిక సంవత్సరానికి బహిరంగ వేలం నిర్వహించినట్లు కమీషనర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ దినసరి కూరగాయల మార్కెట్ ఎస్.రాజా పాట మొత్తం జిఎస్టితో పాటు 18,10,000/- చెల్లించారు అదేవిధంగా ప్రైవేట్ బస్ స్టాండ్ ఈ చిరంజీవి వారి సిహెచ్ పాట 12,70,000/- జిఎస్టి తోపాటు చెల్లించారు. అదేవిధంగా జంతు వధశాల పిపి సునీల్‌కుమార్.హెచ్చు పాట 4,02,000/- జిఎస్టి తోపాటు చెల్లించారు. దీనికి కౌన్సిలర్ల ఆమోదం కోరామన్నారు.










