Jul 23,2023 21:27

ప్రజాశక్తి - పెనుమంట్ర
           ప్రస్తుతం రైతాంగం సార్వా పంట వరి నాట్లు వేసేందుకు బెంగాలి పద్ధతిపై మక్కువ చూపుతున్నారు. మండలంలోని 12,200 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 80 శాతం రైతులు బెంగాలి పద్ధతిలో వరినాట్లు వేస్తున్నారు. ముఖ్యంగా ఎంటియు 1318 రకం 60 శాతం, స్వర్ణ 30 శాతం, 64 రకం ఐదు శాతం, ఇతర విత్తనాలు కొత్త విత్తనాలు ఐదు శాతం వరి నాట్లు వేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. బెంగాలి వరి నాట్లకు ఎకరానికి రూ.నాలుగు వేలు అవుతుందని పెనుమంట్రకు చెందిన ఒక కౌలు రైతు జక్కంశెట్టి సత్యనారాయణ చెబుతున్నారు. గత 15 ఏళ్లుగా కౌలుకు పంట పండిస్తున్నానని చెప్పారు. మడిలో నుంచి ఆకు తీసి నాట్లు వేసేందుకు రూ.నాలుగు వేలు అవుతుందన్నారు. మామూలుగా మన ప్రాంతంలో ఎకరం ఆకు తీయడానికి రూ.1600 నుంచి రూ.1800 ఖర్చవుతుందని, వరినాట్లు వేయడానికి రూ.2300 అవుతుందని చెబుతున్నారు. వరి నాట్లు వేసిన పదిరోజులకు నత్రజని ఎరువులు వాడాలని ఎఒ ఎ.జ్యోషిల అన్నారు. ఇప్పటికే మండలంలో 1850 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయని తెలిపారు.