ప్రజాశక్తి-పుత్తూరు టౌన్ : పట్టణ ప్రజల తాగు నీటి సమస్య పరిస్కార్నికై తెలుగు గంగ పైప్ లైన్ ప్రాజెక్ట్ ద్వారా 137కోట్లతో నీళ్ళు తీసుకొస్తానని ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే రోజా, ఆ ప్రాజెక్ట్ పనులు గురించి అసలు ప్రస్తావనే లేదు.నగరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు పోచారెడ్డి.రాకేష్ రెడ్డి ధ్వజం ఎత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నగరి నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి గాలేరు - నగరి ప్రస్తావనే రాకపోవడం, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన పనులు తప్ప వైకాపా ప్రభుత్వం కనీసం మెయింటినెన్స్ ఖర్చులుకు కూడా నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరమని, ఇలానే ఉంటే గాలేరు-నగరి ఎన్నేళ్ళకు పూర్తయ్యేదని నగరి ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి గాలేరు - నగరి అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని రాకేష్ రెడ్డి వాపోయారు.
బడ్జెట్ పై మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల పై భారం మోపుతూ, పన్నుల రూపంలో ఆదాయం పెంచుకున్నాక కూడా మౌలిక అభివృధి పై దృష్టి సారించకుండా,నవ రత్నాలు పేరిట ఖర్చు చేయడం వల్ల వైకాపా ఓట్ల కోసం పాకులాడే ప్రయత్నం చేస్తోందని,ఇలాంటి కకృతి వలన రాష్ట్రం చిన్నాభిన్నమవడం తప్ప ఒరిగేదేమీ లేదని విమర్శించారు.
బడ్జెట్ కేటాయింపులకు ఖర్చులకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు.
పుత్తూరు పట్టణ ప్రజల తాగు నీటి సమస్య పరిస్కార్నికై తెలుగు గంగ పైప్ లైన్ ప్రాజెక్ట్ ద్వారా 137కోట్లతో నీళ్ళు తీసుకొస్తానని ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే రోజా, ఆ ప్రాజెక్ట్ పనులు గురించి అసలు మాట్లాడకుండా, ఈరోజు బడ్జెట్ మీద ఆహా ఓహో అంటూ ప్రకటనలు చేయడం విడ్డూరమని, రైతులకు అండగా ఉంటానని ఎన్నికలకు ముందు వాగ్దానమిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయకపోవడం పై రైతుల పట్ల అతని వైఖరి ఏంటో, ఆయన చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలియ పరచాలి అన్నారు, రైతులకు మొండి చెయ్యి చాచి, రైతులను పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. కాగితాల ప్రకటనలకే తప్ప ఈ బడ్జెట్ ఎవరికి ఎలాంటి లాభం లేదన్నారు.బడ్జెట్ లో కేటాయింపులు తప్ప ఆయా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కు ఖర్చు పెట్టడం లేదని, ఎస్సీ,ఎస్టీ,బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి నవ రత్నాలు కి వాడుకోవడం ఎక్కడి న్యాయమని, వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఎస్ రద్దు చేస్తామని పీఆర్సీని వారంలోనే అమలు చేస్తామని హామీలు ఇచ్చిన జగన్ రెడ్డి ఈరోజు ఈ బడ్జెట్లో దాని మీద కనీసం మాట్లాడక పోవడం దారుణమన్నారు. బడ్జెట్లో నగరి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఎలాంటి కేటాయింపులు జరగకపోవడంపై ప్రశ్నించాల్సిన స్థానిక ఎమ్మెల్యే.రోజా చాలా అద్భుతమని కొనియాడడం హాస్యాస్పదమన్నారు.,.










