Apr 05,2023 15:41

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన డా. బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, భారతదేశ ఉప ప్రధానిగా, దళితులకు ఆయన చేసిన సేవలను ఈ సందర్బంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడబాల నారాయణ మూర్తి,చాపల రమేష్, గుండెమోగుల సురేష్, అడపా ప్రసాద్, కేశవబట్ల విజయ్, అడబాల మురళి, గట్టిం నాని, వీరమహిళలు వెజ్జు రత్న కుమారి,పెనుబోతుల సోమలమ్మ ,చాంద్ బీబీ, విజయ తదితరులు పాల్గొన్నారు.