Apr 05,2023 12:09

ప్రజాశక్తి-కాళ్ల : వేంపాడు గ్రామంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.  బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి , జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ లు పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యిర్రింకి పద్మావతి, భీమవరం ఆర్డీవో దాసిరాజు, ఎంపీడీవో జి స్వాతి, తాసిల్దార్ టిఏ కృష్ణారావు, ఆకివీడు సీఐ గీతా రామకృష్ణ, కాళ్ల ఎస్ఐ ఏ జి ఎస్ మూర్తి, ఎం వి భాస్కరరావు, ఉప సర్పంచ్  వేగేశ్న సుమన్ , గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వీరమల్లు బోస్, పంచాయతీ వార్డ్ మెంబర్ రాపాక ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.