Apr 05,2023 12:56

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : బడుగు బలహీనవర్గాలకు బాబు జగజ్జీవన్‌ రావ్‌ అందించిన సేవలు అమోఘమని యుటీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపి మూర్తి కొనియాడారు. భీమవరం యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగజ్జీవన్‌ రామ్‌ 155 వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పి.ఎస్‌. విజయ రామరాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బి.గోపీమూర్తి బాబు జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. బాబు జగజ్జీవన్‌ రామ్‌ భహక్‌ లో ఏప్రిల్‌ 5, 1908 లో జన్మించారు. స్వాతంత్య్ర సమర యోధుడుగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా బడుగు బలహీన వర్గాలకు సేవ చేశారన్నారు. 1935 లో అంటరానివారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్‌ ఇండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ అనే సంస్థ స్థాపించారన్నారు. 40 సంవత్సరాలకు పైగా వివిధ శాఖలు క్యాబినెట్‌ మంత్రిగా చేసి పేద ప్రజలకు విశేషమైన కృషి చేశారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఆశయాలను తుంగలో తొక్కి నియంతృత్య విధానాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు. దేశంలోని పేద, బడుగు బలహీన వర్గాలకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు కుమార్‌ బాబి, రామకృష్ణ ప్రసాద్‌, రామకృష్ణంరాజు, త్రిమూర్తులు, శ్యామ్యూలురాజు, శ్రీనివాస్‌, గోవింద్‌, అబ్రహం. స్వామి.మోహనరావు, శ్రీనివాస్‌, భవాని ప్రసాద్‌, పాట్సన్‌ పాల్‌,. వామన, కుమార స్వాత్తు, రతన్‌, పాషా, కృపావరం పాల్గొన్నారు.