May 28,2022 13:18

చిత్తూరు : మద్దిపట్లపల్లి వద్ద పెనుప్రమాదం తప్పింది. రాంగ్‌ రూట్‌లో వెళ్లిన బస్సు రోడ్డుపై వెళుతున్న బైక్‌లపై దూసుకొచ్చింది. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో రోడ్డుపై ఉన్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. అత్యంత వేగంగా బస్సు నడపడమే కారణమని స్థానికులు పేర్కొన్నారు.