Aug 27,2022 22:26

బైజూస్‌కు 'విజయం' విద్యార్థుల ఎంపిక
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
ప్రముఖ బహుళజాతి విద్యాసాంకేతిక సంస్థ అయిన బైజూస్‌ ఎడ్యూకేషనల్‌ టెక్నాలజీ కంపెనీ, బంగుళూరు వారు ఈనెల 20వ తేది స్ధానిక సుందరరాజపురంలోని విజయం బిజినెస్‌ స్కూల్‌లో నిర్వహించిన ప్రాంగణ ఎంపిక తుది ఫతితాలు శనివారం విడుదల చేశారు. స్క్రీనింగ్‌ టెస్ట్‌, టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ ప్రక్రియల ద్వారా నిర్వహించిన ఈఎంపికలో విజయం డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న బికాం, బిబిఏ, బిసీఏ విద్యార్థులు 11 మంది ఎంపికయిన్నట్లు విజయం విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ ఎం.తేజోమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు రూ.8,50,000 వార్షిక వేతనంగా అందిస్తారని తెలిపారు. కేవలం డిగ్రీ అర్హతతోనే ఇంజనీరింగ్‌ విద్యార్థుల కంటే ఎక్కువ పారితోషకంతో తమ విద్యార్థులు ఎంపికవ్వడం హర్షినీయమని తెలిపారు. ఈఎంపికతో కలిపి 2021-22 విద్యాసంవత్సరంలో వివిధ ఎంఎన్‌సిలతో తమ విద్యార్థులు 841మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించారు.