ప్రజాశక్తి-కందుకూరు : ఉమ్మడి ప్రకాశం జిల్లా అండర్ 19 బాస్కెట్బాల్ జట్టు, ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 30 వరకు జరిగిన 67వ రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలలో పాల్గొనాన్రు. ప్రకాశం జిల్లా జట్టులో కందుకూరు టిఅర్‌అర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఆరుగరు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జట్టు క్వార్టర్ ఫైనాన్స్ లో ఓడిపోవడం జరిగినది. ఈ పోటీలలో అత్యంత ప్రతిభ కనపరిచిన చదలవాడ హేమంత్ అండర్ 19 ఆంధ్రప్రదేశ్ ఎస్‌జి యఫ్ రాష్ట్ర జట్టుకి ఎంపిక కాబడి పంజాబ్ రాష్ట్రంలో డిసెంబర్లో జరగబోవు 67వ రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలలో పాల్గొనబోవుచున్నాడు. ఈ విద్యార్థికి శిక్షణ ఇచ్చిన టిఅర్‌అర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు తొట్టెంపూడి సుబ్బారావు గార, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కదిరి నాగేశ్వరరావు, టీచింగ్ నాన్ టీచింగ్ అధ్యాపకులు చదలవాడ హేమంత్ కు అభినందనలు తెలియజేశారు.










