జిల్లా జట్టుకి ఎంపికైన విద్యార్థులను అభినందిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు టిఅర్‌అర్ గవర్నమెంట్ కాలేజ్ లో జరిగిన జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ పోటీలలో కందుకూరు బిఅర్ ఆక్స్ ఫర్డ్ కాలేజ్ విద్యార్థులు జిల్లా స్థాయి కి సెలెక్ట్ అయ్యారు.సెలెక్ట్ అయిన నలుగురు విద్యార్థులు.కె వేణు గోపాల్ ,టి.మనివర్మ పి అశోక్,టి మోహన్ చందులు ఉన్నారు. చిత్తూరు జిల్లా లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారు. ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులను విద్యాసంస్థ ల చైర్మన్ ఉన్నం భాస్కర రావు, కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి.బాల భాస్కర రావు,బి.నరేంద్ర బాబు,కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందించారు.










