Oct 06,2023 21:16

ఫొటో : బ్యాలవివాహాల నిర్మూలనపై మాట్లాడుతున్న వక్తలు

బాల్య వివాహల నిర్మూలనపై అవగాహన
ప్రజాశక్తి-కావలి : ముసునూరు ప్రభుత్వ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో సంయుక్త సేవాసంస్థ ద్వారా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం బాల్యవివాహాల నిర్మూలన, విద్య ప్రాముఖ్యత, తల్లిదండ్రుల పాత్ర, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌లపై టెలీవిజన్‌ ద్వారా విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అతిచిన్న వయస్సులోనే ఆడపిల్లలకు బలవంతపు వివాహాలు జరిపించి నందు వల్ల ఎన్నో సమస్యలకు లోనై ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆడపిల్లలకు 18సంవత్సరాలు వయస్సు పూర్తి అయినంత వరకూ పెళ్లిళ్లు చేయరాదన్నారు.
ప్రభుత్వం మంజూరు చేస్తున్న అనేక రాయితీలు, పథకాలు, సద్వినియోగం చేసుకొని, తల్లి దండ్రులు బిడ్డలను బాగా చదివించి మంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నించాలని సలహాలిచ్చారు. అలా కాకుండ బాల్యంలోనే తల్లి దండ్రులు పెళ్లిళ్లు జరిపించిన అలాంటి వారిపై కఠినచర్యలు పోలీసు వారు తీసుకొనే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థినులు తల్లిదండ్రులకు అన్నివిధాల నచ్చచెప్పి ఇష్టపడి, కష్టపడి బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి యదగాలని సలహా ఇచ్చారు. సంయుక్త సేవాసంస్థ అధ్యక్షులు సురేంద్ర చేస్తున్న టెలివిజన్‌ ద్వారా ప్రదర్శిస్తున్న ఇటువంటి, వినూత్న అవగాహన కార్యక్రమం వల్ల కొంతైనా బాలికల్లో, తల్లిదండ్రుల్లో మార్పు వస్తుందని వక్తలు ఆశాభావం వ్యక్త చేశారు. పాఠశాల యాజమాన్యం సెలవుల్లో విద్యార్థులకు చదువులతో పాటు బాలికల స్థితిగతులపై అవగాహన బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ జి.సుజాత, సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర, వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు, ఖాదర్బాష, ఎం.వి.న్‌.ప్రసాద రావు, ప్రధానోపాధ్యాయులు నేలటూరి శివప్రసాద్‌ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.