Feb 24,2022 22:38

గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న దృశ్యం


ప్రజాశక్తి - ఏర్పేడు: మండలంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో ప్రజా ప్రగతి ట్రస్ట్‌, ఏపీ యానాది సంఘం ఆధ్వర్యంలో బాల్య వివాహాలు నిరోధించాలని చట్టంపై గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో ఏపీ యానాది సంఘం అధ్యక్షులు చంద మామల కోటయ్య మాట్లాడుతూ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో యానాది కులాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాలని స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయని పిలుపునిచ్చారు. ప్రజా ప్రగతి ట్రస్ట్‌ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి సాధ్యమైనంత వరకు బాల్య వివాహాలు జరగకుండా చూస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు తమకు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌, ఆర్‌ఐ సంతోష్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ అంజనమ్మ, ఏపీ యానాది సంఘం సభ్యులు వరలక్ష్మి, ముని కుమారి, ఉపాధ్యాయులు మురళీమోహన్‌, ఇందిరా క్రాంతి పథకం సీసీ గురవయ్య గ్రామీణ ప్రాంతాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.