Mar 19,2022 23:41

ముద్దాయిల అరెస్టు చూపుతున్న డిఎస్పీ రవి మనోహరాచారి



అక్రమ సంబంధం బయటపడుతుందనే హత్య
ఆపై చెట్టుకు ఉరి

ప్రజాశక్తి కలికిరి :
శనివారం కలికిరి పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు చేధన అంశాలను వివరించారు. కలికిరి మండలం అద్దవారిపల్లి గ్రామానికి చెందిన కే.రవి కుమారుడు కలిచెర్ల ఉదరు కిరణ్‌ (8) ఈ నెల11వ తేదీ సాయంత్రం కనపడకపోవడంతో కలికిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అదశ్యం కేసు నమోదు చేయగా అదే రోజు సాయంత్రం కిరణ్‌ మతదేహం అద్దవారి పల్లి సమీపంలోని వేప చెట్టుకు వేలాడుతూ కనిపించింది. దాంతో హత్య కేసుగా మార్చి వాయల్పాడు సీఐ నాగార్జునరెడ్డి దర్యాప్తు చేపట్టారు. మండలం లో సంచలనంగా మారిన బాలుడి హత్య కేసు ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లా ఎస్పీ సెంథిల్‌ కుమార్‌,స్పెషల్‌ ఎంఫోర్సు మెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ విద్యాసాగర్‌ నాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ రవి మనోహరచారి పర్యవేక్షణలో మూడు బందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తులో అద్దవారి పల్లి గ్రామానికి చెందిన ఒక స్త్రీ అదే గ్రామానికి చెందిన కలిచర్ల సహదేవ(34) మధ్యగల వివాహేతర సంబంధంను బాలుడు ఉదరు కిరణ్‌ గత శుక్రవారం సాయంత్రం ప్రత్యక్షంగా చూడటం దానిని తల్లిదండ్రులకు ఇతరులకు తెలుపుతానని చెప్పడంతో సదరు మహిళ సహదేవ్‌ సాయంతో కర్రతో మర్మాంగాలపై కొట్టి ఆపై టవల్‌ తో గొంతు బిగించి చంపి అదే రోజు అర్ధరాత్రి వారిద్దరూ కలసి బాలుడి శవమును తీసుకొని వేపచెట్టుకు టవల్తో ఉరివేసుకుని చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారని వారు తెలిపారు. వీరిని శనివారం వాల్మీకి పురం సీఐ నాగార్జునరెడ్డి అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు. ఈ కేసును త్వరితగతిన చేదించిన సిఐ నాగార్జున రెడ్డి ని,కలకడ, వాల్మీకి పురం, కేవి పల్లి యస్‌ఐ లు రవిప్రకాష్‌ రెడ్డి, బిందుమాధవి, బాలకష్ణ, కలికిరి ఏఎస్‌ఐ మధుసూదనాచారి మరియు పోలీసు సిబ్బంది ని ఎస్పీ మరియు డీఎస్పీ అభినందించారు.