Oct 13,2023 22:26

ఫొటో : అవగాహన కార్యక్రమం చేపడుతున్న దృశ్యం

బాలికలకు అవగాహన సదస్సు
ప్రజాశక్తి-కావలి : సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో కావలి పట్టణం వాయినందన ప్రెస్‌వీధిలో ఉన్న సాయి ట్యుటోరియల్‌లో శుక్రవారం టెలివిజన్‌ ద్వారా ''గుడ్‌ టచ్‌ అండ్‌ బ్యాడ్‌ టచ్‌''పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థవ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, సంస్థ సభ్యులు ఎమ్‌ అజిత్‌ బాబు, ఎమ్‌.వి.ఎన్‌.ప్రసాద రావు, నేలటూరి శివప్రసాద్‌ రెడ్డి, సాయి ట్యుటోరియల్‌ నిర్వహుడు పి.వి.సాయితేజ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సురేంద్ర టెలివిజన్‌ ద్వారా పిల్లలకు అర్థమయ్యేలా గుడ్‌ టచ్‌ అండ్‌ బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పించడంపై సంతోషాన్ని వ్యక్త పరిచారు. పిల్లలపై ఎవరైనా తప్పు ప్రవర్తిస్తే వెంటనే వారిని ప్రతిఘటించి తల్లిదండ్రులకు లేదా టీచర్లకు తెలియజేయాలని తెలిపారు.
పిల్లలు అపరిచిత వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయి ట్యుటోరియల్‌ నిర్వహుడు పి.వి.సాయితేజ మాట్లాడుతూ తమ ట్యుటోరియల్‌లో అడిగిన వెంటనే టెలివిజన్‌ ద్వారా పిల్లలకు గుడ్‌ టచ్‌ అండ్‌ బ్యాడ్‌ టచ్‌ పై అవగాహన కల్పించిన సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రకు, సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.