బాలికల ఆరోగ్య సంరక్షణపై అవగాహన
ప్రజాశక్తి-కావలి : వెంగళ రావు నగర్లోని శ్రీ పొట్టిశ్రీరాములు ఉన్నత పాఠశాలలో సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర ఆధ్వర్యంలో ''అంతర్జాతీయ బాలికల దినోత్సవం'' సందర్భంగా బుధవారం టెలివిజిన్, ద్వారా బాల్యవివాహాలు, కిషోర బాలికల, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణం వెంగళరావు నగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ రమ్యశ్రీ, హెల్త్ సూపర్‌వైజర్ సుగుణలు పాల్గొని మాట్లాడారు. అతి చిన్న వయసులోనే బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలు, సమస్యలు, కిషోర బాలికల ఆరోగ్యం విషయాలపై తీసుకోవాల్సిన జాగ్రతలు గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. బాలికల అనసరపు విషయాలకు దూరంగా ఉండాలని, దాని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు హయ్యుల్ హయ్యమ్, వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షుడు షేక్ ఖాదర్‌భాషా, విశ్రాంత లెక్చరర్, ఎమ్.వి.ఎన్.ప్రసాదరావు, ఉపాధ్యాయులు, బాలికలు పాల్గొన్నారు.










