Oct 02,2023 22:18

ఎంపికైన క్రీడాకారులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం స్పోర్ట్స్‌: సబ్‌ జూనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో శ్రీకాకుళం జిల్లా బాల, బాలికల జట్లు విజేతలుగా నిలిచినట్లు జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కోత పూర్ణచంద్రరావు, పి.వి.జి.కృష్ణంరాజు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా నందాల (మహానంది దేవస్థానం మైదానం) వేదికగా సెప్టెంబరు 30, అక్టోబరు 1, 2వ తేదీల్లో జరిగిన పోటీల్లో జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనతో రాణించారు. 60 ఏళ్ల బాల్‌ బ్యాడ్మింటన్‌లో చరిత్రలో శ్రీకాకుళం క్రీడాకారులు తొలిసారి రాష్ట్రస్థాయిలో విజయదుందుబి మోగించినట్లు చెప్పారు. విజేతలకు మహానంది దేవాలయం ట్రస్టు చైర్మన్‌ కొమ్మ మహేశ్వరరెడ్డి, ఇఒ కాపు చంద్రశేఖర్రెడ్డి, నిర్వాహుకులు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.అజయ్కుమార్‌, కోచ్‌, మేనేజర్లు యానాల తారకేశ్వరరావు, ఎం.మధుసూదనరావు, కోశాధికారి బి.హెచ్‌ అరుణ్‌కుమార్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు సూర శ్రీనివాసరావు, నదుకుదిటి ఈశ్వరరావు, గొండు శకంర్‌, రుప్ప రమణమూర్తి, నరసింహనాయుడు, తదితరులు అభినందించారు.
నలుగురికి స్టార్‌ ఆఫ్‌ ఆంధ్రా అవార్డులు
రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబర్చిన నలుగురు జిల్లా క్రీడాకారులకు స్టార్‌ ఆఫ్‌ ఆంధ్రా అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర బాల్‌బాడ్మింటన్‌ సంఘం ప్రతినిధులు క్రీడాకారులకు అవార్డులను, ప్రశంశాపత్రాలను అందజేశారు. జిల్లా నుంచి బాలికల విభాగంగా ముంత గాయత్రి (ఎచ్చెర్ల), సింగూరు నందిని (ఎచ్చెర్ల), బాలుర విభాగంలో శిష్టు హిమత్‌ కుమార్‌ (కేశవరావుపేట), లబ్బ మణికంఠ (నరసన్నపేట) స్టార్‌ ఆంధ్రా అవార్డులు అందుకున్నారు. ఈ నలుగురు క్రీడాకారులతో పాటు నర్సీపురం ప్రవీణ్‌ కుమార్‌ జాతీయస్థాయి పోటీలకు స్టాండ్‌ బైగా ఎంపికైనట్లు ఎపి బాల్‌బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విజయశంకర్‌రెడ్డి, రావు వెంకటరావు, కోశాధికారి బి.హెచ్‌.ఆదినారాయణ, చీఫ్‌ రిఫరీ ఎన్‌.వి.ఎన్‌.రాజులు ప్రకటించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు విశాఖపట్నంలో జరగనున్న శిక్షణ శిబిరంలో తర్పీదు పొందుతారు. అక్టోబరు 17 నుంచి 19వ తేదీ వరకు చత్తీషఫుడ్‌ బిలారులో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రా తరుపున జిల్లా నుంచి పాల్గొనున్నారు.