Sep 05,2023 23:41

ఓటర్లతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

        ఉరవకొండ : స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌ - 2024లో భాగంగా చేపడుతున్న రీవెరిఫికేషన్‌ ప్రక్రియను బాధ్యతాయుతంగా చేపట్టాలని కలెక్టర్‌ ఎం.గౌతమి ఆదేశించారు. మంగళవారం నాడు ఉరవకొండ మండలం చిన్నముష్టురు, విడపనకల్లు మండలం మాళాపురం, విడపనకల్లు పట్టణంలో స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌ - 2024లో భాగంగా చేపడుతున్న రీవెరిఫికేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఓటర్లతో స్వయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బిఎఒలు వంద శాతం తిరిగి పరిశీలన చేయాలన్నారు. రీవెరిఫికేషన్‌ ప్రక్రియను ఈనెల 7వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉందన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ ఓటు హక్కు తొలగించరాదన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించేలా బిఎల్‌ఒలు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరణం, మార్పులు, చేర్పులను ఇంటింటికీ వెళ్లి జాగ్రత్త పరిశీలించి జాబితాలో చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీంద్ర, డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి, తహశీల్దార్లు హరిప్రసాద్‌, ఈరమ్మ, బిఎల్‌ఒలు, పాల్గొన్నారు.