ప్రజాశక్తి - పాలకొల్లు
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చింతపర్రుకు చెందిన జి.బుద్దేశ్వరరావుకు వసుధ ఫౌండేషన్ తరపున రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని గురువారం అందజేశారు. అలాగే పాలకొల్లు లక్ష్మీనగర్‌కు చెందిన ర్యాలీ సుగుణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు రూ.10 వేలు అందజేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వంగా నరసింహారావు, పెన్మత్స బుద్ధరాజు చేతుల మీదుగా ఇద్దరి సాయం అందజేశారు.










