
ఫిర్యాదిదారులతో మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక
* ఎస్‌పి స్పందనకు 20 అర్జీలు
ప్రజాశక్తి- శ్రీకాకుళం: బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా చూస్తామని ఎస్‌పి జి.ఆర్.రాధిక భరోసానిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'స్పందన' కార్యక్రమంలో 20 అర్జీలు అందాయి. వీటిని ఎఎస్‌పి టి.పి.విఠలేశ్వర్‌తో ఫిర్యాదులు వివరాలు పరిశీలించారు. అనంతరం ఎస్‌పి ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ తగాదాలు నాలుగు, పౌర సంబంధాలు ఆరు, పాత ఫిర్యాదులు రెండు, ఇతరత పిర్యాదులు 8 వచ్చాయి. ఫిర్యాదిదారులకు చట్టపరిధిలో పరిష్కరించి సత్వర న్యాయం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.