Apr 09,2022 13:39

వెదురు కుప్పం (చిత్తూరు) : మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కె.నారాయణ స్వామి చొరవతో వెదురుకుప్పం మండలంలోని ఐదుగురు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఉన్న బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. శనివారం ఎంపిడివో కార్యాలయంలో మండల వైసిపి నాయకులు చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ... గుండుపల్లి గ్రామానికి చెందిన మమత కు మూడు లక్షల రూపాయల ఎల్‌వోసీ ని సంబంధిత హాస్పిటల్‌ కు పంపిణీ చేశారు. ఆళ్ళమడుగు గ్రామానికి చెందిన కె.రామచంద్రారెడ్డి కి రూ.70 వేలు, పచ్చి కాపల్లం గ్రామానికి చెందిన వి.మునిసుంధర్‌ ఆచ్చారి కి రూ.75 వేలు, ఆర్‌ కె ఎం పురం గ్రామానికి చెందిన ఎ.కిరణ్‌ కుమార్‌ కు రూ.35 వేలు , అయ్యనుగారిపల్లి గ్రామానికి చెందిన మార్‌ కొండ రాజు కి రూ.35 వేల చెక్కులను పంపిణీ చేశారు.