Apr 02,2023 08:42

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్న మాజీ సైనికుల సంఘం నాయకులు

       అనంతపురం కలెక్టరేట్‌ : కూడేరు మండలం కలగల్ల గ్రామంలో దళిత మీనుగ సంజీవ అనే రైతు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబ సభ్యులను అనంతపురం జిల్లా మాజీ సైనికుల సంఘం గౌరవ అధ్యక్షులు వీకే.రంగారెడ్డి ఆధ్వర్యంలో శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతు సంజీవ వ్యవసాయంలో టమోటా, మిర్చి, వేరుశనగ లాంటి పంటలు సాగు చేసేవాడని, ఇందులో గిట్టుబాటు ధర రాక వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడ్డాడని తెలిపారు. చిన్న వయసులోనే మానసికంగా కంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఇతనికి పది సంవత్సరాల లోపు ఇద్దరు కూతుళ్లు ఉన్నారన్నారు. మృతుని ఐదు సంవత్సరాల పెద్ద కూతురి విద్యాపరమైన దత్తతను వికె.రంగారెడ్డి తీసుకున్నారు. రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి జరిగినట్లు భవిష్యత్తులో ఇతర రైతులకు ఇలాంటి సంఘటనలు జరగకుండా గ్రామస్థాయిలో అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. తన వంతుగా మృతుని రెండవ కూతురుని పదవ తరగతి వరకు చదివించడానికి దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతపురం జిల్లా మాజీ సైనిక సంఘం అధ్యక్షులు కెప్టెన్‌ షేకన్న ఆధ్వర్యంలో రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి విరాళాలు అందజేయాల్సిన దాతలు ''మీనుగ శాంతమ్మ, ూదీ× దీAచీఖ Aజజఉఖచీు చీఖవీదీజు= 20432629256లో జమచేయాలన్నారు. ఫోన్‌పే ద్వారా సాయం చేయాల్సిన వారు 93476 71796కు నగదు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా మాజీ సైనికుల సంఘ ప్రధాన కార్యదర్శి కెప్టెన్‌ ఉమామహేశ్వరరావు, ట్రెజరర్‌ తిమ్మారెడ్డి కలగల్ల సిపిఎం నాయకులు చండ్రాయుడు, గ్రామస్తులు పాల్గొన్నారు.