Oct 12,2023 19:29

కరపత్రాలు పంపిణీచేస్తున్న నాయకులు

కరపత్రాలు పంపిణీచేస్తున్న నాయకులు
బాబుతో నేను కరపత్రాలు పంపిణీ
ప్రజాశక్తి-ఉదయగిరి:పుల్లాయపల్లి పంచాయతీలో బాబుతో నేను కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి. చెంచలబాబు యాదవ్‌ కరపత్రాలు పంపిణీ చేశారు. గురువారం మండల పరిధిలోని పుల్లాయపల్లి పంచాయతీలో ఆయన కరపత్రాలు పంపిణీ చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నా మన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతనబోయిన బయన్న. మాజీ కన్వీనర్‌ నరసింహ యాదవ్‌. జల్సా. ఏసుదాసు .వెంకటేశ్వర్లు టిడిపి నాయకులు పాల్గొన్నారు.