Oct 18,2023 20:08

కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణంలోని 8వ వార్డు చైతన్య స్కూల్‌ వెనక పక్క, జాల రామయ్య రైస్‌ మిల్‌ ప్రాంతాల్లో బాబుతో నేను కార్యక్రమం జరిగింది. టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఇంటింటా ప్రచారం నిర్వహించిన పార్టీ నాయకులు. అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో చంద్రబాబు జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపో యారని, ప్రజలంతా చంద్రబాబు మద్దతు పలకడాన్ని జగన్‌ జీర్ణించుకోలేక స్కిల్‌ డెవలప్మెంట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చి అబద్దాల ప్రచారం చేస్తున్నారని నాగేశ్వరరావు చెప్పారు. పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, పిడికిటి రఘనాధరావు, వార్డు అధ్యక్షుడు దివి శ్రీనివాసులు, నాయకులు అత్తోట మాల్యాద్రి, వడ్డేళ్ళ వెంకటరావు, దివి రవి శేఖర్‌, చిమ్మిరి రామచంద్ర ప్రసాద్‌, కలవకూరి మాధవరావు, కాకుమాని ఆంజనేయులు, కాకుమని శీను, దివి శ్రీధర్‌, నల్లూరి సింగయ్య, బోట్ల రమణయ్య, కల్లూరి వెంకటేశ్వర్లు, గుళ్ళా నరసింహం, చిమ్మిరి సురేష్‌, ఓరుగంటి వెంకట్రావు, పిడికిటి పద్మ ఉన్నారు.