ప్రజాశక్తి-కందుకూరు :'బాబుతో నేను' ఇంటింటికి ప్రచారం కార్యక్రమం కందుకూరులో కొన సాగుతోంది. సోమవారం కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేస్తూ, చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి వివరించారు. 9వ వార్డు లోని రామాలయంలో పూజల అనంతరం గాయత్రి డిగ్రీ కాలేజీ, రెవెన్యూ కాలనీ ప్రాంతాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, వార్డు అధ్యక్షుడు రమేష్ బాబు, స్థానిక నాయకులు చదలవాడ కొండయ్య, దామా మల్లికార్జున, కాకుమాని శ్రీను, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు చెన్నారెడ్డి వెంకటరమణ, చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, దామా కోటేశ్వరరావు, దూదిపల్లి మహేష్, కల్లూరి శీను, ఇమ్మానియేల్, ఏసుపోగు రవి, సుదర్శన్, గోచిపోతల మోషే, వడ్డెళ్ళ రవిచంద్ర, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, రాయపాటి శ్రీనివాసరావు, బత్తిన మాల్యాద్రి పాల్గొన్నారు.










