ప్రచారం చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ టిడిపి సోమవారం 'సైకో పోవాలి' పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టింది. మండలంలోని నరుకూరు గ్రామంలో టిడిపి గ్రామ అధ్యక్షులు అరికాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టిడిపి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ సభ్యుల కొణతం రఘుబాబు పాల్గొన్నారు. మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో సైకో జగన్ ను ఇంటికి పంపించెందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా వున్నారని రఘుబాబు తెలిపారు. మాజి ఎంపీటీసీ పాకం వెంకయ్య, నాసిన రవీంద్ర, బొచ్చు మణి, ముష్టిగుంట సుబ్రహ్మణ్యం, నాసిన విజయకుమార్, ఇనమాల శ్రీనివాసులు ఉన్నారు.










