Jan 07,2023 20:34

బాబు తీరు బాధాకరం : ఎంపీ
ప్రజాశక్తి- పుంగనూరు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో చేసిన తీరు బాధాకరమైందని, జీవో నెంబర్‌ ఒకటిని తుంగలో తొక్కి దానికి విరుద్ధంగా కార్యక్రమం నిర్వహించడం మంచిది కాదని రాజంపేట పార్లమెంటు సభ్యుడు లోక్సభ ప్యానల్‌ స్పీకర్‌ మిథున్‌ రెడ్డి అన్నారు. గడపగడప కార్యక్రమంలో భాగంగా పుంగనూరు మున్సిపాలిటీలో 3,7 ,8 వార్డులలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌ బాషా అధ్యక్షతన శనివారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కుప్పం పర్యటన మూడు రోజులు నిర్వహించడం పోలీసులు అనుమతి లేకుండా చేపట్టడం చట్టానికి విరుద్ధంగా పూర్తిగా నిర్వహించారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇటీవల జరిగిన సంఘటన దష్టిలో ఉంచుకొని జీవో నెంబర్‌ ఒకటి తెచ్చిందని దాని నిబంధనలు పాటించకుండా ప్రజల జీవితాల ప్రమాదకర పరిస్థితుల్లో సమావేశాన్ని నిర్వహించుకోవడానికి పోలీస్‌ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాంటిది నియోజకవర్గంలో పలనచోట మీటింగ్‌ పెడతామని కానీ తెలుపకుండా పూర్తిగా చట్ట విరుద్ధంగా చేపట్టడమే కాకుండా దానిపై రాద్ధాంతం చేసి వీళ్ళ ప్రవర్తించిన తీరు బాగా లేదన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చి జీవో టిడిపి వైసిపి కమ్యూనిస్టులకైనా జీవో వర్తిస్తుందన్నారు. ఇటీవల జరిగిన సంఘటనలు పునరావతం కాకుండా ఉండాలని జీవో తేవడం జరిగిందన్నారు. పుంగనూరు మున్సిపాలిటీలో ప్రజాసమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని గడపగడప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ముడా చైర్మన్‌ వెంకట్‌రెడ్డి యాదవ్‌, జానపద కళల అభివద్ధి చైర్మన్‌ నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌ రెడ్డి, జడ్పిటిసి జ్ఞాన ప్రసూన చంద్ర రెడ్డి యాదవ్‌, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ ఎండి అమ్ము, వైస్‌చైర్మన్లు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.