Oct 24,2023 17:21

పూజలు చేస్తున్న మాజీ మంత్రి చంద్ర మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :అక్రమ కేసుల నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల కావాలని ఆకాంక్షిస్తూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పూజలు చేశారు.విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తోటపల్లిగూడూరు మండలం సౌత్‌ ఆములూరు గ్రామంలోని ఆములూరమ్మ తల్లి ఆలయంలో టిడిపి అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో సోమిరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యాంలా త్వరలో విడుదల అవుతారని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి చంద్రమోహన్‌ రెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.