ప్రజాశక్తి-యాదమరి : స్వాతంత్ర సమరయోధులు అడుగుజాడల్లో ప్రతి విద్యార్థి నడవాలని ఇన్చార్జి హెచ్ఎం త్రివేణి విద్యార్థులుకు దిశా నిర్దేశం చేశారు.
ఆజాదీకా అమృత్సోవ్ లో భాగంగా కె.గొల్లపల్లె ఉన్నత పాఠశాల విద్యార్దులు, ఉపాద్యాయులు కాశిరాళ్ళ పుర వీధులలో హెరిటేజ్ వాక్ కార్యక్రమంను గురువారం నిర్వహించారు. ర్యాలీలో భాగంగా విద్యార్దులు వివిధ స్వతంత్ర సమర యోధులు, దేశ నాయకుల వేష ధారిలో పాల్గొన్నారు. ఇన్ చార్జిHM త్రివేణి, సోషియల్ టీచర్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు, ప్రతి పాఠశాలలోను, ప్రతి కార్యలయంలోను ఘనమగా 75 స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలి అని, ప్రతి పౌరుడు తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకొవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు కనకాచారి, భాస్కర రెడ్డ, మురళీధర్, చిన్నదొరై, మహేష్, షణ్మగం, ఉష, అరుణ, G.భారతి, వాణి, పద్మ, నాగరత్న, మంజుల, విష్ణుప్రియ, మరియు విద్యార్దులు పాల్గొన్నారు.










