ఆయుష్మాన్ భవను సద్వినియోగం చేసుకోవాలి
ప్రజాశక్తి - కార్వేటినగరం:పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భవ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ లతబాలాజీ అన్నారు. శుక్రవారం సీహెచ్సీ లో సూపరింటెండెంట్ డాక్టర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భవ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఆయుష్మాన్ భవ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్, వంటి వ్యాధులకు ప్రాథమిక చికిత్సతో పాటు ఉచితంగా మందులు పొందవచ్చన్నారు. జగనన్న మహాభాగ్యం అన్ననినాదంతో ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీలో దాదాపు 90 శాతం వ్యాధులకు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ధనంజయవర్మ, ఎంపీడీవో మోహనమురళీ, సింగిల్ విండో అధ్యక్షుడు లోకనాధరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ పరంధర్, వైసిపి సీనియర్ నాయకులు ఆమీద్, లోకనాథనాయుడు, పద్మనాభశెట్టి, డాక్టర్ శ్రుతిబార్గవి, డాక్టర్ మురళీ, డాక్టర్ శ్రుతివాణి, పలువురు పాల్గొన్నారు.










