Apr 25,2021 17:21

ఇదొక ప్రైవేటు పుస్తకం. అలా అనొచ్చనుకుంటాను. అందరికోసం వేసిన పుస్తకాలలాంటిది కాదు మరి. ఎందుచేతంటే ఈ పుస్తకం కథా వస్తువు చిర్రాపూరి సర్వేశ్వర శర్మగారు. ఆయన అలవాట్లు, ఇష్టాలు, స్నేహాలు, గుణాలు, కొన్ని జీవిత విశేషాలు. వీటి చుట్టూ తిరిగాయి రచనలు. ఇది శర్మగారి జీవిత చరిత్ర కాదుకానీ వ్యక్తిత్వ చిత్రణ.
   కావడానికి ఇది ప్రైవేటు పుస్తకమే కానీ ఇతరులూ చదవొచ్చు. ఆనందించే ఆలోచించే విషయాలు చాలా ఉన్నాయి. ఫలానా శర్మగారి సొంత విషయాలు కదా! అన్న సందేహం అక్కర్లేదు. వ్యక్తిగత విషయాలే రచయితల శక్తి వల్ల, ప్రేమ వల్ల, ఆర్తి వల్ల, ముఖ్యంగా ప్రధాన వ్యక్తి విశిష్టతవల్ల... విశ్వజనీనతని పొంది, సాహిత్యంగా మారిపోతాయి. ఇది అలా మారింది.

- డా. రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు నడిచిన పుస్తకం
రచయిత: చిర్రావూరి సర్వేశ్వర శర్మ
పుస్తక సందర్భం: వారి శతజయంతి సంవత్సరం
వెల: రూ.400/-
ప్రతులకు: శ్రీమతి సి.వల్లీ శ్యామల
8-3-320/ఎఫ్‌/308
కీర్తి అపార్టుమెంట్స్‌
అమీర్‌పేట్‌
హైదరాబాద్‌- 73.
సెల్‌: 9346821416