ప్రజాశక్తి-పాలకొల్లు : జంతువుల నుంచి మనుష్యులకు, మరియు జంతువులకు సంక్రమించు వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారని పాలకొల్లు పశువైద్య శాఖాధికారి డా మల్లేశ్వర రావు చెప్పారు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా పాలకొల్లు పశువైద్య శాఖ కార్యాలయంలో కుక్కలకు యాంటి ర్యాబీస్ ఇంజెక్షన్లు లైన్స్ క్లబ్ సహకారంతో వేసారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ జోనల్ చైర్మన్ ముచ్చర్ల సత్యనారాయణ, లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎన్ అన్నపూర్ణ, కార్యదర్శి మాఘం నారాయణరావు, కోశాధికారి దోను ప్రసాద్,పేర్ల రాము, ఎన్హెచ్ఎస్వి జయంత్, శ్రీఖాకొల్లు కామేశ్వరరావు, మాఘం శ్రీనివాస్, మాఘం విష్ణు, ఆర్ శ్రీరాం చంద్రమూర్తి, డా చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.










