ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : మలేరియా నివారణ మాసోత్సవాల సందర్భంగా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వై.వి.లక్ష్మణరావు ఆధ్వర్యంలో సోమవారం వైద్య ఉద్యోగులు డా.వై.ఎస్.ఆర్.పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని 28,29 వార్డులలో ఆరోగ్య అవగాహన కార్యక్ర మాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ దోమల నివారణ చర్యల్లో భాగంగా దోమతెరలు వాడడం, ఇంటి కిటికీలకు,తలుపులకు జాలీలు బిగించుకోవడం, ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించడం తప్పని సరన్నారు. నీటి తొట్టెలను ప్రతీ వారంరోజులకొకసారి ఖాళీ చేసి తిరిగి నింపుకోవాలన్నారు. డ్రై డే ఫ్రైడే కార్యక్ర మాల్లో భాగంగా నీటి నిల్వలలో దోమలు అభివృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రముగా ఉంచాలని, నీరు నిల్వ ఉండు ప్రదేశాలలో అబేటు స్ప్రే చేయాలని లక్ష్మణరావు వివరించారు. స్తానిక నారాయణ జూనియర్ కాలేజి విద్యార్థిని విద్యార్థులకు మలేరియా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో వార్డు ఆరోగ్య కార్యదర్శులు జీ.బేబీ, చంద్రకళ, ఆరోగ్య సహాయకులు ఈ.కాంతారావు, కే.శ్యామ్, అషా కార్యకర్త దుర్గ,వాలంటీర్లు సచివాలయం సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.










