Apr 03,2023 15:00
  • సిడిపిఓ భారతి
  • బి.పప్పురులో  పౌష్టికాహార పక్షోత్సవాలు ముగింపు 

ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని బి.పప్పురు అంగన్వాడీ కేంద్రంలో సోమవారం సిడిపిఓ భారతి బొందలవాడ సెక్టార్ సూపర్వైజర్ మధుమాలిని ఆధ్వర్యంలో స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మార్చి 23 నుండి ఏప్రిల్ 3 వరకు కొనసాగిందని ఇందులో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఎటువంటి పౌష్టికాహారం తీసుకోవాలి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు చిరుధాన్యాల వల్ల కలిగే ఉపయోగాలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ వివరించారు. అదేవిధంగా ప్రతి అంగన్వాడీ కేంద్రం లో గర్భిణీలు, బాలింతలు చిన్నారులకు పౌష్టికాహారం అందివ్వడం జరుగుతుందని పౌష్టికాహారంతో పాటు ఆకుకూరలు కూరగాయలు తీసుకోవడం వల్ల మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో వెల్ బేబీ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు తృణీత, వెంకటలక్ష్మి, తులసమ్మ, ఆదినారాయణమ్మ, శ్రీదేవి, సుజాత, పార్వతీ సుధామణి తదితరులు పాల్గొన్నారు.