ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంలో గురువారం జాతీయ డెంగీ మసోత్సవాల లో భాగంగా ఈరోజు ఆత్మకూరు ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. డెంగీ జ్వరం అతి సాధారణ వైరల్ జ్వరం మాత్రమే భయపడాల్సిన పనిలేదు. దీనికి దోమ వాహకంగా పనిచేస్తుంది. దీనిని ఈడీస్ ఈజిప్టి లేదా టైగర్ దోమ అంటారు. ఇది ముఖ్యంగా ఆపరిశుభ్ర పరిసరాల్లో అనగా నీటి నిల్వలు ఎక్కువగా వున్న చోట, పూల కుండీలు, కూలర్లలో, పాత డబ్బాలు, టైర్లు, కొబ్బరి చిప్పలు మొదలైన వాటిలో గ్రుడ్లు పెట్టి ఆవాసం ఏర్పరచుకొని వివిధ దశల్లో ఎదిగి వారం రోజుల్లో దోమగా తయారవుతుంది. ఈ దోమలు 300 మీ. కంటె ఎక్కువ దూరం ఎగురలేవు.
లక్షణాలు:- తీవ్రమైన తలనొప్పితో జ్వరం, శరీరంపై ఎర్రటి దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు వంటివి వుంటాయి.
డెంగీ వ్యాధి కేవలం ఎలిసా టెస్టు ద్వారా మాత్రమే నిర్దారణ అవుతుంది..
నివారణ:- నీటి నిల్వలు లేకుండా చేసుకోవడం, వారానికి ఒకసారి డ్రైడే పాటించడం, పూల కుండీలు, కూలర్లలో తరచు నీరు మార్చడం, ఇంటి కిటికీలకు దోమలు రాకుండా మెష్ కొట్టించడం,పిల్లలు, పెద్దలు శరీరం పూర్తిగా కప్పబడే విధంగా దుస్తులు ధరించడం చేయాలి.
లక్షణాలు కనపడిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకుని ఉచితంగా చికిత్స తీసుకోవాలని తెలియజేయుచున్నాం. అలాగే ఈరోజు ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు క్లినిక్ డే నిర్వహించి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత స్కానింగ్ కు జిల్లా కేంద్రానికి రెఫెర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యులు దయాకర్, సబీహా సుల్తానా, ఆరోగ్య విస్తారణాధికారి నాగేశ్వరయ్య, సీహెచ్ ఓ షమీమ్ తార, పీహెచ్ ఎన్ తులసమ్మ, సూపర్ వైజరు వెంకటరత్నమ్మ, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు,ఏఎన్ ఎమ్ లు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










