- ఎమ్మెల్సీ వై శివరాం రెడ్డి
ప్రజాశక్తి-ఉరవకొండ(అనంతపురం) : డెంగ్యూ నివారణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ వై.శివరాం రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వజ్రకరూర్ మండల పరిధిలోని కొనకొండ్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి గంగాధర ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ మాస ఉత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వై.శివరాం రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశ అనంతరం కొనకొండ్ల గ్రామంలో భారీ ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలాగే ఎమ్మెల్సీ వైస్ శివరాం రెడ్డి కొనకొండ్ల గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫీవర్ సర్వే చేయాలని మండల స్థాయి అధికారులతో పాటు గ్రామ సచివాలయ సిబ్బందికి ఆశా వర్కర్లకు,ఆరోగ్య సిబ్బందికి వాలంటరీలకు సూచించారు.ప్రతి రోజు ప్రతి గ్రామంలో సర్వే చేయాలని కార్యక్రమం సక్రమంగా జరిగే లాగున వైద్యాధికారులు మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ జరపాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉరవకొండ సబ్ యూనిట్ అధికారి భక్తుల కోదండరామిరెడ్డి,ఎంపీడీవో విజయ లలిత,వజ్రకరూర్ మండల రెవెన్యూ అధికారి అనిల్ కుమార్,సదాశివం,ఈవోఆర్డి గ్రామ సర్పంచ్ మరియు గ్రామ కార్యదర్శి,కొనకొండ్ల హై స్కూల్ హెడ్మాస్టర్ మాజీ మండలాధ్యక్షుడు రామచంద్ర,కొనకొండ్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ,వజ్రకరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎం పద్మావతి ఆశ అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










